జనం న్యూస్ 28 ఫిబ్రవరి పూడూరు మండల ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ పరిధిలో కంకల్ గ్రామంలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం గ్రామంలోని వీధులగుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగింది.స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పూడూరు మండల్ మాజీ ఎంపీపీ మల్లేష్, పార్టీ గ్రామ అధ్యక్షులు నీరటి నరసింహులు, గ్రామ సీనియర్ నాయకులు గౌరీ కుమార్, హనుమంత్ కుమార్, గ్రామ యువజన నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.