జనం న్యూస్ // ఫిబ్రవరి // 28 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జాతీయ సైన్స్ దినోత్సవం
పురస్కరించుకొని జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత పాల్గొని విద్యార్థులు తయారుచేసిన (ఏటీల్ )మరియు సైన్స్ ప్రయోగాలను చూసి అభినందించారు. ఇలాంటి సైన్సు ప్రయోగాల వలన సమాజ పురోగమనానికి సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసినారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లగొండ సదానందం మాట్లాడుతూ.. సైన్స్ ప్రయోగాలు విద్యార్థులలో సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా ఉంటుందని, సైన్స్ ప్రయోగంలో పాల్గొన్న విద్యార్థులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు ఏం. సంతోష్ కుమార్, వి. స్రవంతి, ఎం. స్వామి, పి పద్మ, జి. శైలజ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.