జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తోటపాలెం సమీపంలో బొండపల్లి జనార్ధన్ అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ… జనార్ధన్ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని, డిగ్రీ చదివిన సమయంలో ప్రేమ విఫలమైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి కుమార్ తెలిపారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.