జనం న్యూస్ ఫిబ్రవరి 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేండ్ల రాజారెడ్డి తల్లి గంగవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం రోజునా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ బాధితకుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలియజేసారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివాన్నోళ్ల శివకుమార్, మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడేం గంగప్రసాద్, నిజామాబాద్ జిల్లా డీసీసీ డెలిగేటు గడ్డం జీవన్ రెడ్డి, మేకల సాయన్న, రేండ్ల రమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.