జనంన్యూస్. 01. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల్ కొండూరు గ్రామంలో వాగులో నుండి అక్రమంగా మొరం ను తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిరికొండ ఆర్ఐ నాగయ్య అట్టి ప్రదేశానికి వెళ్లి తనిఖీ చేయగా ఒక జెసిబి మరియు ఒక ట్రాక్టర్ తో ఎటువంటి ప్రభుత్వాలు మాత్రం లేకుండా దొంగతనంగా మొరం ను తరలిస్తున్నటువంటి ట్రాక్టర్ మరియు జెసిబి లను పట్టుకొని సిరికొండ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి సిరికొండ ఎస్సై కి అప్పగించగా సిరికొండ ఎస్సై పంచనామ నిర్వహించి అట్టి ట్రాక్టర్ మరియు జెసిబిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడమైనది అట్టి ట్రాక్టర్ కొండూరు గ్రామానికి చెందిన నాయుడి లింబయ్య దాని డ్రైవర్ గాదె గంగాధర్ మరియు సిరికొండ గ్రామానికి చెందిన చెక్క బండి జీవన్ రెడ్డి జెసిబి మరియు దాని డ్రైవర్ జునైద్ ఖాన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది