సీనియర్ నాయకులు మచ్చ బాబు, దినేష్, తుర్కపల్లి నాగరాజు, కొరమైన యాదగిరి జనం న్యూస్ మార్చ్ 2, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండల కేంద్రంలో మాన్య మందకృష్ణ మాదిగ అభిమాన సంఘం ( ఎం ఆర్ పి ఎస్ ) సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ శనివారంఅంబేద్కర్ చౌరస్తాలో మాదిగ జాతి కోసం అసువులు బాసిన అమరులకు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ పోరాట స్పటిమా ఆయన జీవితం జాతికి అంకితం ఇచ్చారని అలాంటి మహా నాయకుడు మాదిగ జాతిలో పుట్టడం గర్వకారణం అని అన్నారు. మాదిగ జాతి ఆత్మ గౌరవ పోరాటంలో అమరులైన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్టు తెలిపారు. మందకృష్ణ మాదిగ చేపట్టిన ఎన్నో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఆయన పిలుపే శిరోధారంగా భావించి ఎమ్మార్పీఎస్ ఉద్యమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా మండల కేంద్రంలో అనేక కార్యక్రమాలు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరగడం దానికి ప్రతి ఒక్కరు సానుకూలంగా ఉద్యమానికి సమయం కేటాయించడం జతి ప్రతి బిడ్డ బాధ్యత అని గుర్తు చేశారు కార్యక్రమంలో నాయకులు మచ్చ మహేష్ కుమార్, అశోక్ చిరంజీవి, హరీష్,గడ్డం మహేష్ , కోరమైన నాగరాజు, రాజు, ఆకాష్,హరి ప్రసాద్, అరవింద్ ,భాను, ప్రణయ్, చక్రి,చంటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.