జనం న్యూస్ మార్చ్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో పార్కులుచెరువుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కాముని చెరువు మరియు మలేషియన్ టౌన్షిప్ వద్ద ఐదు ఎకరాలు అలాగే పది హేను గేమ్వ ఫేస్ చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ఖాళీ స్థలము తొమ్మిది వ ఫేస్ లోని రెండు ఎకరాల ఖాళీ స్థలాన్ని హెచ్ఎండిఏ పరిధిలోని తీసుకుని అభివృద్ధి పరచాలని సూచించారు అంతే కాకుండాడసున్నం చెరువు నల్ల చెరువు కూడా అభివృద్ది చేయాలని తెలిపారు ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు తగిన సూచనలు చేసి వాటి భద్రత కూడా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని తెలిపారుమ మేడం గతంలో నిర్మించిన పార్కుల అభివృద్ధి నేడు కుంటు పడుతోందని… ఆవేదన వ్యక్తం చేశారు ..ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ అధికారులు, కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు.. సబియా గౌసుద్దీన్ మాజీ కార్పొరేటర్ పగడాలు బాబురావు.తదితరులు పాల్గొన్నారు