జనం న్యూస్ మార్చి ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి రాష్ట్ర బడ్జెట్లో ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ కు 515 కోట్ల రూపాయలు పైబడి నిధులు కేటాయించి నిరుపేదాలైన ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్ద పీఠవేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ ,అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కంకటాలరామం కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో పదవులు మట్టికే కేటాయించడం జరిగిందని దానికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు ఏమీ కేటాయించక అభివృద్ధికి నోచుకోకపోవడం మనందరికీ తెలిసిన విషయమేనని అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి వారిని ఆదుకోవడం జరుగుతుందని రామం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నిధుల ద్వారా ఆర్యవైశ్యులలో ఆర్థికంగా వెనుకబడిన వారు లబ్దిపొందుతారని ఆయన అన్నారు.