మాదిగ అమరవీరుల త్యాగం తోనే వర్గీకరణ కల నెరవేరింది
ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. జిల్లా ప్రధాన కార్యదర్శి లు కొత్తపల్లి అంజయ్య మాదిగ,పాతకోట్ల నాగరాజు మాదిగ
జనం న్యూస్ మార్చి 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
-సబ్జెక్టు- మాదిగ అమరవీరుల త్యాగం ఫలితంగానే మాదిగల చిరకాల కోరిక అయిన వర్గీకరణ సాధ్యమైందని
ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. జిల్లా ప్రధాన కార్యదర్శి లు కొత్తపల్లి అంజయ్య మాదిగ,పాతకోట్ల నాగరాజు మాదిగ,లు అన్నారు.
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ అధ్యక్షతన అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది,అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించారు,అనంతరం వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా దండోరా ఉద్యమం ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించారని ఎస్సీ వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణ త్యాగం చేశారని వారి త్యాగాల ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం రాబోతుందని వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఎం.ఎస్. పి. మునగాల మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీనుమాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీమండల ఉపాధ్యక్షులు మొలుగూరి వెంకటేశ్వర్లు,బరాఖాత్ గూడెం గ్రామశాఖ అధ్యక్షుడు గుడిపాటి పెద్ద కనకయ్య మాదిగ, సీతానగరం గ్రామశాఖఅధ్యక్షులు పుల్లూరి వెంకటేశ్వర్లు, ఆకుపాముల గ్రామశాఖఅధ్యక్షులు తాళ్లపాక వీరబాబు,రేపాల గ్రామశాఖఅధ్యక్షులు మేరీగ వెంకటేశ్వర్లు,గంట బాబు, లంజపల్లి వినయ్ కుమార్,సిర్రా గణేష్,దావీదు,వివిధగ్రామాల అధ్యక్షులు తదితరులుపాల్గొని మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.