ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మన్తుర్తి శ్రీకాంత్ .. జనం న్యూస్1 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జాతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ. దేశ ప్రధాని మన తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ నగరానికి విమానాశ్రయం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ఉమ్మడి వరంగల్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరిన రోజు అని వరంగల్ ప్రాంత ప్రజలే కాకుండా వరంగల్ చుట్టూ ఉన్న అన్ని జిల్లాల ప్రజలు దేశ ప్రధానికి రుణపడి ఉంటారని, ఈ యొక్క విమానాశ్రయం ప్రకటన కోసం కృషి చేసిన జాతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కృష్ణ రెడ్డి కి మరియు బండి సంజయ్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మరొక్కసారి రుజువైందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ముష్కే వెంకటేష్ యాదవ్, చేదురాల వెంకటేష్, పెరుగు మధు, వంగ రమేష్, కోడెం రమేష్, విద్యాసాగర్, సుకినే సుధాకర్, సింగన బోయిన రాజు, అంబీర్ శ్రీనివాస్, కొమ్మిడి లచ్చిరెడ్డి, పాండ్రాల రాజయ్య, ఎట్లా రగోతం రెడ్డి, అల్లి కుమార్, ఎర్ర గొల్ల రాజు, బొక్కల పాటి కుమారస్వామి, చీర్లవంచ అనిల్, శుభ వర్ధన్, ఉడుత సూర్యనారాయణ, సల్పాల కిరణ్, దాసరి తేజ, మన్తుర్తి తిరుపతి యాదవ్, మాజీ సర్పంచ్లు కొమ్మిడి నిరంజన్ రెడ్డి, అంబాల ప్రతాప్, తదితర నాయకులు పాల్గొన్నారు.