జనం న్యూస్ మార్చ్ 1 మండలం పెన్ పహాడ్: మండల పరిధిలోని నాగులపాడు గ్రామంలోని శ్రీ త్రికుటేశ్వరాలయం లో మహాశివరాత్రి పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్రామీణ పోటీలు కబడ్డీ ,కోలాటం, వాలీబాల్ క్రీడలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా శివపార్వతులను పల్లకిలో గ్రామంలోని వీధి వీధికి కొబ్బరికాయలు కొట్టి భక్తిశ్రద్ధలతో భజనలు బ్యాండ్ చప్పుడుతో కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఊరేగించి సాంస్కృతిక నృత్యాలతో ప్రదర్శించి గ్రామంలో దాతల సహకారంతో ఇంటింటికి లడ్డు పులిహోర ప్రసాదాలు పంచడం జరిగింది . కబడ్డీ కోలాటం బహుమతులకు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ఘనంగా శాలువాతో సత్కరించడం జరిగింది. కబడ్డీ మొదటి విజేతలుగా కల్లూరు 30,016/- 2 విజేతగా తడకమళ్ళ 20,016/- 3 విజేతగా నూతనకల్15016/- 4 కేతేపల్లి 5 అనాజిపురం మోడల్ స్కూల్ 6 దోసపాడు 7 నాగులపాడు 8 జంగం పడిగే ,కోలాటం;మొదటి విజేతగా 20016/- పాండ్య నాయక్ తండ రెండో విజేత అరవపల్లి 15016/-మూడో విజేతగా చెరువు గట్టు 10016/- వాలీబాల్; మొదటి విజేతగా యాదగిరి పల్లి గాజుల మొలకపురం రెండో విజేత మూడో విజేతలు నాగులపాడు గెలుపు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పోగుల జాన్ గౌరవ అధ్యక్షులు కొండ జానకి రాములు సంకరమది నిరంజన్ రెడ్డి, సుధీర్ రెడ్డి దామోదర్ రెడ్డి వైస్ అధ్యక్షులు ఒగ్గు దేవయ్య సంకరమద్ది జగ్గారెడ్డి మచ్చ బక్కయ్య ప్రధాన కార్యదర్శి మీసాల సోమయ్య కోశాధికారి ఒగ్గు సతీష్ ఎదుల రామ్ రెడ్డి రాయలి శ్రీను ఏపూరి నాగేష్ కుర్రి శీను గాజుల నాగయ్య ఒగ్గు సైదులు ఆడపు మహేష్ కుక్కడపు నాగరాజు మీసాల ఇంద్రయ్య మామిడి మల్సూర్ పీఈటిలు తదితరులు పాల్గొన్నారు