జనం న్యూస్ 02 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:శ్రీకాకుళం జిల్లాలో ITDA ను ఏర్పాటు చేయాలని ఆ జిల్లా గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు చౌదరి లక్ష్మీ నారాయణ, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు గేదెల రమణ మూర్తి కోరారు. ఈ మేరకు విజయనగరంలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావుకు తన కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు.జిల్లాల మార్పు తరువాత శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఎ లేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.