జనం న్యూస్ మార్చ్ 2 ముమ్మిడివరం ప్రతినిధి: మహిళ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి జ్వాలా సాగర్ శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ముమ్మిడివరం ఆపిల్ స్కూల్ విద్యార్థినులకు విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలు, , పరిశుభ్రత, ఓపెన్ హౌస్ సదస్సులో భాగంగా ముమ్మిడివరం ఆపిల్ స్కూల్ విద్యార్థినులకు మహిళల రక్షణ కొరకు ఉన్న వివిధ చట్టాల గురించి కూలంకుషంగా అవగాహన కల్పిస్తున్న ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమ్ .మోహన్ కుమార్ మరియు సిబ్బంది.అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా ఇబ్బందులకు గురిచేసిన ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఎస్సై జ్వాలా సాగర్ విద్యార్థినులను కోరారు. విద్యతోపాటు క్రమశిక్షణ, సంస్కారం అలవర్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులను ఆయన కోరారు.ఓపెన్ హౌస్ లో భాగంగా పోలీస్ స్టేషన్ లోని లాకప్,వైర్లెస్ సెట్ పనితీరు, కౌన్సిలింగ్ రూమ్, రెస్ట్ రూమ్ లను పోలీస్ వ్యవస్థ పనితీరును విద్యార్థినులకు ఎస్ ఐ వివరించారు.