ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు మెండుగా ఉండాలి
సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్
జనం న్యూస్ మార్చి 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు-సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మండల ముస్లిం సోదర సోదరీమణులకు ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు,ఆధ్యాత్మికతను జీవిత పరమార్థాన్ని తెలియజేసి క్రమశిక్షణ పెంపొందిస్తాయని, అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని ఆయన అన్నారు.