జనం న్యూస్ 03 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పదవ తరగతి విద్యార్థుల్లో పరీక్ష భయాన్ని పోగొట్టడం కోసం భారత విద్యార్థి ప్రదర్శన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 10న నిర్వహించిన ప్రజ్ఞా వికాసం పరీక్ష విజేతలకు జిల్లా పరిషత్ నందు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన వన్ టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్ గారు, న్యూ సెంట్రల్ స్కూల్ అధినేత రవితేజ గారు , యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవిఆర్కె ఈశ్వర్ రావు గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఇటువంటి భయాన్ని పోగొట్టే విధంగా పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పరీక్షను నిర్వహించిన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ అంటే ఉద్యమాలు పోరాటాలతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యపడుతుంది కాబట్టి విద్యార్థులు అందరూ తమ తమ చదువుల్లో రాణించాలని ఆ విధంగా వారు అభివృద్ధి చెంది దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని వక్తలు కోరారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు డి రాము ,సిహెచ్ వెంకటేష్ లు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా యుటిఎఫ్ ,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞ వికాసం పరీక్ష జిల్లా వ్యాప్తంగా ఐదువేల మంది విద్యార్థులతో నిర్వహించామని జిల్లా స్థాయిలో నగదు బహుమతులు ,మండల స్థాయిలో మెమెంటోలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాస్థాయి మొదటి బహుమతి జి యశ్వంత్ (బొబ్బిలి), రెండవ బహుమతి ఎం పల్లవి (skota), మూడవ బహుమతి A లాస్య శ్రీదర్శిని (విజయనగరం) గెలుచుకున్నారని తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో పరీక్ష రాసిన విద్యార్థులకు మండల స్థాయిలో బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకీ ,పి రమేష్ ,జిల్లా సహాయ కార్యదర్శి కే జగదీష్ , S సోమేష్ తదితరులు పాల్గొన్నారు.