జనం న్యూస్ 03 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆదివారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న రెవిన్యూ భవనం లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో డివిజన్, పట్టణ స్థాయి సమావేశం జరిగింది . జేఏసీ జిల్లా సెక్రెటరీ జనరల్ భానుమూర్తి పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షుడు మహేంద్ర బాబు మాట్లాడుతూ పత్రిక కథనాల్లో ఆప్కాస్ రద్దు చేస్తామని వచ్చిందని , దీనివల్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర మనోవేదన చెందుతున్నారని ఆప్కాస్ రద్దు చేయడం జరిగితే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అంతకన్నా మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు