జనం న్యూస్ 03 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎంపికయ్యారు. కార్యదర్శిగా ఎన్నికైన వెంకటనాయుడు పెంట జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నాడు. విజయనగరంలో ఆదివారం జరిగిన జిల్లా సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి ఎంపికపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాయమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని వీరు తెలిపారు.