జనం న్యూస్ 03 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో హుజూర్ హజరత్ సూఫీ సెహన్సా బాబా ఖాదర్ అవులియా వారి దర్బార్ లో రంజాన్ మాస తొలి పర్వదినాన్ని పురష్కరించుకుని, ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లీం సోదరులతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఖాదర్ షా దర్గా దర్బార్ ధర్మకర్త ఖలీల్ బాబు ముస్లీం సోదరులను ఆహ్వానించి వారికి పోషక విలువలతో కూడిన సంతృప్తికరమైన ఇఫ్తార్ విందును అందించారు.