జనం న్యూస్ // మార్చ్ // 3 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ఆత్మగౌరవం, సమాన అభివృద్ధి, రాజ్యాధికారంల భాగస్వామ్యం లక్ష్యంగా తెలంగాణల బహుజనులు సంఘటిత ఉద్యమం చేయాలని సామాజిక న్యాయ జేఏసీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్త కుల జన గణన చేయాలని, దామాషా రీతిల చట్ట సభలల్ల బీసీలకు రిజర్వేషన్లు కలిపించాలని, జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని సామాజిక న్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. అనేక సామాజిక ఉద్యమాలల్ల త్యాగాలు చేసిన బహుజనులకు అధికారంల భాగస్వామ్యం లేకపోవడానికి సొంత పార్టీ పెట్టుకోకపోవడమే కారణమని సామాజిక న్యాయ జేఏసీ అభిప్రాయపడ్డది. కాన్షిరాం జయంతిని పురస్కరించుకొని మార్చ్ 15 శనివారం బహుజనుల రాజ్యాధికార సాధన సమాలోచన సమావేశం హైదరాబాద్ ల ఏర్పాటు చేస్తున్నామని సామజిక న్యాయ జేఏసీ తెలిపింది.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిక్కీ ఆఫీస్ మీటింగ్ హాల్ 4వ అంతస్తు, సామ్రాట్ కాంప్లెక్స్, ఏ జి ఆఫీస్ ఎదురుగ, హైదరాబాద్ ల సమావేశం జరుగుతుంది.
తెలంగాణల రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులు ఓటు చైతన్యం పెంచడానికి సంఘటితంగా ఉద్యమించాలని సామాజిక న్యాయ జేఏసీ పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్ ల సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, నాయకులు మేకపోతుల నరేందర్ గౌడ్, డాక్టర్లు ఎం ఫ్ గోపినాథ్, ఎం ఏ షోయబ్, ప్రతిభ లక్ష్మి ముదిరాజ్, శివ ముదిరాజ్, దాసోజు లలిత, అడ్వకేట్స్ పేరం అలేఖ్య, మల్లికంటి
ప్రొఫెసర్లు ననుమాస స్వామి, గాలి వినోద్, వెంకన్న, బెక్కం జనార్దన్ సొగరా బేగం, రోజానేత, వాగ్గేయకారులు వరంగల్ శ్రీనివాస్, మచ్చ దేవేందర్, రెంజర్ల రాజేష్, వనపర్తి నరేందర్ గౌడ్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య, గురిజాల రవీందర్ తదితరులు మీడియా సమావేశంల పాలుగొన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు,అమృతోత్సవాలు జరిగినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా, బహుజనులు బాగుపడలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాధికారంల బహుజనులు భాగస్వాములు అయితేనే బతుకులు బాగుపడతాయని, అందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటును సద్వినియోగం చేసుకోవాలని సామాజిక న్యాయ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణల నిశ్శబ్ద ఓట్ల విప్లవం ద్వారా బహుజనులు రాజ్యాధికారం సాధించుకోవాలని జేఏసీ కోరింది. తెలంగాణల తొంబై శాతనికి పైగా ఉన్న బహుజనుల (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్) బతుకులు మారలేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా అణచివేతకు, వివక్షకు గురవుతూనే ఉన్నం మని,అవకాశాలు కోల్పోతున్న మని,అన్ని రంగాలల్ల వెనకబడే ఉన్నమన్నారు.కారణం చాలా స్పష్టం, మనం అధికారంల లేకపోవుడే, ఓట్లు మనయి, అధికారం మాత్రం ఆధిపత్య కులాలదా అని జేఏసీ ప్రశ్నించింది."సకల సమస్యలకు రాజ్యాధికారం పరిష్కారం" అన్న అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేద్దాం అని,ఇకనైనా మేలుకుందాం అన్నారు.మనల మనమే ఏలుకుందామని సామజిక న్యాయ జేఏసీ పిలుపునిచ్చింది. 101 మంది సామాజిక ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థులు పాల్గొని బహుజన రాజ్యాధికార సాధన సమావేశాన్ని విజయవంతం చేయాలని సామాజిక న్యాయ జేఏసీ పిలుపునిచ్చారు.