జనం న్యూస్ 03 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) విద్యానగర్ పంచాయతీ చుంచుపల్లి మండలం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నివాసి అయిన నడిగొట్టు కళావతి w/0 లేట్ లక్ష్మీనారాయణ వయస్సు 45 ఈమె అంగన్వాడి ఆయగా పనిచేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనది మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో మరణించడం జరిగింది ఈ మరణం ప్రభుత్వ హత్యగా నమోదు చేయాల్సిన అవసరం ఉన్నదని ఎందుకనగా సంబంధిత ప్రభుత్వ హాస్పిటల్లో సరియైన వైద్యం అందుబాటులో లేక ప్రభుత్వ వైద్యం పూర్తిగా ప్రజలకు అందని ద్రాక్ష లాగా దాపురించిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కురిమెల్ల శంకర్ పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు అనారోగ్యానికి గురైతే చావు ఒక్కటే మార్గం, అనే ప్రభుత్వo అనుసరిస్తున్న వైద్య విధానాలు చెప్పకనే చెప్పినట్టుగా ఉన్నాయి అట్టి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆమె దశదినకర్మలలో పాల్గొన్న నాయకులు ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ శేషాద్రి వినోద్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల సదానందం పట్టణ గౌరవ అధ్యక్షులు కురిమెళ్ళ దుర్గయ్య వెంకటయ్య కుటుంబ సభ్యులు నడిగడ్డ శివ నడిగొట్టు మల్లేష్ నడిగోట్టు శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు