మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
విద్యార్థులు స్వయంపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది జనం న్యూస్ మార్చ్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపిచేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చండూర్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులై తరగతి గదిలో బోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా బి .సుశాంత్ , ఎం ఈ ఓశ్వేత డి ఈ ఓ రవీందర్ , కలెక్టర్ జి చరణ్ , ఉపాధ్యాయులుగా సౌమ్యశ్రీ ,సానియా , అనిత ,విష్ణువర్ధన్ , నవదీప్ ,శిరీష ,అలేఖ్య ,అక్షయ , పల్లవి ,ఇందు ,తులసి మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు అభినందించడం జరిగింది. ఉపాధ్యాయులు విష్ణు ,పిబి,కవిత, ఉషారాణి ,శశిధర్, నర్సింలు ,సలీమా పాల్గొన్నారు