జనం న్యూస్ 04 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఆందోళనలో విద్యార్థులు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని సాయి తేజ ( పారామెడికల్) ఒకేషనల్ జూనియర్ కాలేజీలో ఆ విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఫీజు కట్టనిదే హాల్ టికెట్ ఇవ్వనని కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్పడంతో విద్యార్థులు దిక్కుతోచన స్థితిలో పడిపోయారు. ఎవరితోనైనా రెకమెండ్, కానీ ఫోన్ చేయించిన మంచిగా ఉండదంటూ విద్యార్థులను భయపెట్టారు….ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తాము లేదంటే మీ దిక్కున చోట చెప్పకోండి అంటూ భయపెడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయమై విద్యార్థులకు హాల్ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఎంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా వీరు మాత్రం భయపడటం లేదు ప్రతి అధికారి మాకు తెలుసు అంటూ విద్యార్థులను భయపెడుతున్నారని వాపోయారు. ఎగ్జామ్ ఫీజు కట్టినా…ప్రాక్టికల్స్ లో మంచి మార్కులు కావాలంటే ప్రాక్టికల్స్ వచ్చిన అధికారులకు డబ్బులు ఇవ్వాలని ఒక్కొక్కరి దగ్గర 1200 రూపాయలు వసూలు చేశారని విద్యార్థులు, తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. ఎగ్జామ్ రాయ కపోతే మా పిల్లల భవిష్యత్తు ఏంటి, విద్యార్థులు ఏదైనా చేసుకుంటే బాధ్యత ఎవరు వహిస్తారని అని ప్రశ్నించారు ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు ఎంతోమందికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అప్రెంటిషిప్, చేయకుండా పనులకే పరిమితమయ్యారని ఉన్నతాధికారులు కూడా ఈ కాలేజీ ని ఎప్పుడు తనిఖీ చేయరని అన్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు న్యాయం చేసి కాలేజీ యాజమాన్యపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.