జనం న్యూస్. జనవరి 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రధాన రహదారి అంతా గుంతల మయంగా మారి అటు వాహనదారులు ఇటు గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇష్టానుసారంగా కంకర క్రషర్ యజమాన్యం రాత్రింబగలు భారీ లోడుతో టిప్పర్లను అతివేగంగా నడపడంతోనే హత్నూర గ్రామం నుండి మొదలుకొని ఐటిఐ కాలొనీ వరకు రహదారిపై పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయని స్థానికులు మండిపడ్డారు.. అటుగా వెళ్లే వాహనదారులు సైతం ప్రమాదవశాత్తు ప్రమాదాలకు గురై మంచాన బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కంకర క్రషర్ యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని రహదారి అంతా మరమ్మతులు చేయించాలని హత్నూర గ్రామస్తులు కోరారు.