జగిత్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి ( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ ) జనం న్యూస్, మార్చ్ 4, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలుపొంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి బహిష్కరణకు గురి అయిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న పార్టీ ఇచ్చిన పదవికి వెంటనే రాజీనామా చేసి నీ నిజాయితీని నిరూపించుకోవాలని జగిత్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి బాపూజీ డిమాండ్ చేశారు పార్టీ ఇచ్చిన పదవిలో ఉంటూ అదే పార్టీని ముఖ్యమంత్రిని విమర్శించడం సిగ్గుచేటని పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని అన్నారు బిజెపి టిఆర్ఎస్ పార్టీలతో కుమ్మక్కై న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ బీసీల కోసం మొసలి కన్నీరు కార్చడం ప్రజలకు అర్థమైందని అన్నారు బీసీ వాదం పేరిట మొసలి కన్నీరు కార్చి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తే ప్రజలు ఉపేక్షించరని వెంటనే రాజీనామా చేయకపోతే రానున్న రోజులలో భారీ మూల్యం చెల్లించక తప్పదని అందే మారు తి బాపూజీ అన్నారు