జనం న్యూస్ జనవరి 12 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కొల్వయి గ్రామానికి చెందిన కస్తూరి బాపన్న తండ్రి/వెంకన్న, 47 సంవత్సరాలు, మున్నూరు కాపు కొల్వాయి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ రోజున మధ్యాహ్నం అందాద 03:30 గంటలకు తుంగూరు గ్రామ శివారులో గల పొలానికి కాలువ ద్వారా నీరు వస్తున్నాయా, లేదా అని చూసుటకు వెళ్ళి, ఒడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నరిగె తిరుపతి యొక్క వ్యవసాయ బావిలో పడి ఈత రాకపోవడం వల్ల చనిపోవడం జరిగింది అని తన భార్య అయిన కస్తూరి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్పూర్ ఎస్సై కుమారస్వామి తెలియజేసినారు.