జనం న్యూస్ -ఫిబ్రవరి 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి దేవరాజ్ కొద్దిరోజుల క్రితం వికారాబాద్ లో జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ మీట్ లోమొదటి స్థానాన్ని
సాధించి త్వరలో జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్, పిఈటీ అరుణ తెలిపారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విద్యార్థి దేవరాజ్ మొదట వికారాబాద్ లో జరిగిన సబ్ జూనియర్ మీట్ లో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు జమ్మూ కాశ్మీర్ లోజరిగే జాతీయస్థాయి పోటీల్లో కూడా అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు ఈ ఎంపిక పట్ల కళాశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.