జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 4. తర్లుపాడుమండలం తర్లుపాడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు 13వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పెరుమాళ్ళ బాలమోహన్ రావు తర్లుపాడు హిందూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న 110 మంది విద్యార్థులకు ,వేసవి ని దృష్టి లో పెట్టుకొని 3500/- రూపాయలు విలువ గల వాటర్ బాటిల్స్ ని చాకోలెట్స్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మస్తానయ్య , ఫిజియోథెరపీ డాక్టర్ కోటేశ్వరరావు , పాఠశాల చైర్మన్ పటాన్ ఫిరోజ్ ఖాన్ , కొలగట్ల భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు కృష్ణకుమారి, విజయ, వెంకటేశ్వర్లు, వనిత జ్యోతి పాల్గొన్నారు. వాసవి వనిత క్లబ్ సభ్యులు రంగారత్నమ్మ , మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.