జనంన్యూస్. 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా.ధర్పల్లి. సిరికొండ.రూరల్ పలు. పలు ప్రాంతంలో వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు,కౌలు రైతులు సంవత్సరాల తరబడి వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయంతోనే తమ కుటుంబాలను పోషిస్తున్నారని వ్యవసాయ రైతు కావేటి నరేందర్ తెలిపారు. రైతులను కొద్ది కాలంగా వరుణుడు కరుణించకపోవడంతో వాతావరణంలో మార్పుల వలన సాగునీటి కొరత, భూసారం దెబ్బతినడం వలన భూగర్భ జలాలు చెరువులు,బావులు, పిల్ల కాలువలో సైతం నీరు ఇంకిపోయి వ్యవసాయానికి నీరందించే బోరు బావిలో వ్యవసాయానికి సరిపడే నీరు అందకపోవడంతో వ్యవసాయ భూములు తీవ్ర ఉష్ణోగ్రత తాకిడికి బీటెలు వారి భూములు సారం కోల్పోయి,వేసిన వరి నాట్లు వేసిన కొద్ది నాళ్ళకే ఎక్కడికక్కడ ఎండిపోయిన భూములు దర్శనమిస్తుంటే తమ కుటుంబాలకు అన్నం పెట్టలేక బీటెలు వారిన వ్యవసాయ భూములలో ఎండిన వరిపైరును చేసేది ఏమీ లేక పశువులకు మేతగాను కొందరు పంట చేలును కాల్చివేశారని అన్నారు. ఆరుగాలం శ్రమించి ఆకలి తీర్చేవాడి కుటుంబం నేడు ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారని అయినా వంశపారంపార్యంగా నేను నా కుటుంబం నా తర్వాత మళ్ళీ ఒక తరం ఇలా తర తరాలు వ్యవసాయం చేస్తూనే ఉంటాం అన్నారు. వ్యవసాయం అనేది రైతుల జీవన శైలీగా ప్రతిగటించారు. కొందరు కౌలు రైతులు వ్యవసాయాన్ని జీవన ఉపాధిగా భావిస్తూ భూస్వాముల వద్ద వ్యవసాయ భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయ పంటను పండించడానికి వ్యవసాయ పనులలో వ్యవసాయ కూలీలతో వ్యవసాయ భూమిని సాగు చేసి పంట పండించే సమయంలో భూగర్భ జలాలు ఇంకిపోవడం చేత సన్న,చిన్న కారు రైతులు తీవ్ర నష్టంలో రైతుల జీవితాలు అంధకారమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. కొందరు కౌలు రైతులు వ్యవసాయ కూలీలకు అయ్యే ఖర్చులను చెల్లించలేక ఇటు భూస్వాముల వద్ద కౌలుకుగాను తీసుకున్న కౌలు భూములకు తగిన నగదును చెల్లించలేక ఉరి కొయ్యలకు ఊగిసలాడుతుంటే మరోవైపు వ్యవసాయ పంటకు బ్యాంకు రుణాలను చెల్లించలేక పంట పండించడానికి తెచ్చుకున్న పురుగుల మందులు పంట చేనులో సేవించి ప్రాణాలను వదులుతున్నారని వీరి ప్రాణాలకు బాద్యులు ఎవరని ప్రశ్నించారు. వ్యవసాయ రైతుల కుటుంబాలు వ్యవసాయంలో నష్టం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలు అయ్యాయని అన్నారు. అయినా రైతుల ప్రాణాలు పోయిన కాని రైతు దేశ ప్రజలకు అన్నం పెట్టే ఐశ్వర్యవంతుడుగా కొనసాగడానికి ప్రభుత్వం సహకరించి రైతులను కాపాడుకోవాలని అన్నారు. రైతు పడని కష్టంలేదు. రైతు చూడని నష్టంలేదు. రైతు చూడని చావులేదు. అయినా వ్యవసాయంలో ప్రతిక్షణం ఎగిసిపడే కెరటంల పడుతూ..లేస్తూ దేశ ప్రజల కడుపు నింపడానికి ప్రతీ క్షణం కష్టపడుతూనే ఉండే ఏకైక వ్యక్తి రైతుగా దేశ చరిత్ర చెప్తోంది అని తెలిపారు. తాను పస్థులున్న దేశ ప్రజలు సుఖశాంతులతో బుక్కెడు బువ్వకోసం అలమటించకుండా భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈ వ్యవసాయ పోరాటంలో సాయం అనే గుణాన్ని కాపాడుకోవడానికి రైతు పడే కష్టం వివరణాత్మకం. ఒక పూట అన్నం పెట్టడానికి ఆరుగాలం కష్టపడి ఆహారాన్ని పండిస్తారని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అనేకోణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను రైతు కుటుంబాలను ఆదుకోవాలి.