జనం న్యూస్ 5 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) ప్రభుత్వం ఫ్రీగా బస్సులు పెట్టడం వల్ల ఆటో వారికి ఉపాధి లేక ఆటో ఫైనాన్స్ కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇరుకు రోడ్లపై ఇబ్బందులు పడుతూ సాయంత్రం అయితే కోటరు తాగుడు యాక్సిడెంట్ చేసుడు అమాయక ప్రజల ప్రాణాలు తీసి వారి కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి రెండు రోజుల క్రితం మదికల్ వద్ద జరిగిన ఆక్సిడెంట్ దృష్ట్యా ఈరోజు భీమరం బస్టాండ్ ఏరియా లో ప్రమాద నివారణ నిమిత్తం ఆటో డ్రైవర్ లకు అవగాహన కల్పించి ఆటో డ్రైవర్లు వెహికిల్ సంబంధించిన పేపర్స్ ఉంచుకోవాలని, మద్యం తాగి మరియు అతివేగంగా అజాగ్రత్త గా వెహికిల్ నడపకూడాదని ఇన్స్యూరెన్స్ చెపించుకోవాలని ఎస్ ఐ కే శ్వేత మరియు పోలీస్ సిబ్బంది సూచనలు ఇచ్చారు