
కార్మికుల హక్కుల పరిరక్షణకు సంఘటితంగా ముందుకు సాగాలి: కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్: అక్టోబర్ 5, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కూకట్పల్లి ఆర్టీసీ డిపో గేటు వద్ద సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొని ఎన్నికలలో బాణం గుర్తుకు ఓటు వేసి విజయాన్ని అందించాలని కార్మికులను కోరారు.ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుని బాణం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి, మార్కెట్ చైర్మన్ పుష్పారెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్, ఆర్టీసీ డిపో కమిటీ సీనియర్ నాయకులు ఆర్.హెచ్. రావు, అశోక్, అక్బర్, శివ ముదిరాజ్, ఉపేందర్ యాదవ్, శేఖర్, లక్ష్మి, రేణుక, రాంరెడ్డి, వి.ఎల్. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.