
జనం న్యూస్ 18 సెప్టెంబర్ శనివారం సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిద్దిపేటకు చెందిన నలుగురు విద్యార్థినులు అస్మిత మహిళా లీగ్ జిల్లా స్థాయి అండర్-19 సైక్లింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.జిల్లా స్థాయి పోటీలలో తమ ప్రతిభను చాటుకున్న విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు ఎంతో గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులు .పి. అంకిత – ఎంపీసీ, ద్వితీయ సంవత్సరం-ఎస్. సాయిప్రసన్న – ఎంపీసీ, ద్వితీయ సంవత్సరం- ఎం. లిఖిత – సీఈసీ, ప్రథమ సంవత్సరం- రిజ్వానా బేగం, సీఈసీ, ప్రథమ సంవత్సరంఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హిమబిందు మాట్లాడుతూ, విద్యార్థినులు విద్యతో పాటు క్రీడలు మరియు ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం ద్వారా ఇతర విద్యార్థినులకు కూడా స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఎంపికైన విద్యార్థినులను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీలకు శుభాకాంక్షలు తెలిపారు.