
జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జీవీఎంసీ 110 వ వార్డులో ఎన్నికల ప్రచారం జబర్దస్త్ కళాకారులతో జోరుగా కూటమి అభ్యర్థి తాడి శాంతి కుమారి తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అభ్యర్థితో పాటు కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. వార్డులో అత్యధిక మెజారిటీ సాధించే లక్ష్యంతో కూటమి నేతలు ప్రకటించిన హామీలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనసాల రామకృష్ణ కీలక హామీ ఇచ్చారు వార్డుల్లో ఏ వార్డుకు అత్యధిక మెజార్టీ వస్తే ఆ వార్డు అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులు అదనంగా రెండు కోట్ల రూపాయలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏ బూతులో అత్యధిక మెలటి వస్తే ఆ బూతు పరిధిలో అభివృద్ధి పనుల కోసం 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇక అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ సైతం మరో హామీ ఇచ్చారు అత్యధిక మెజారిటీ సాధించిన వార్డుకు చెందిన ప్రజలను కాశీ అయోధ్య పుణ్యక్షేత్రాలు యాత్రకు తీసుకెళ్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో 11 వ వార్డుతో పాటు ఇతర వార్డుల్లోనూ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా అభ్యర్థుల కోటమి నాయకులు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు ఇంటింటి ప్రచారం ఓటర్లతో ప్రత్యక్ష సమావేశాలు స్థానిక సమస్యలపై చర్చలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రచారం ఓటర్లతో మమేకం అయ్యేలా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.//