
జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల ఉమ్మడి వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ ఎన్నికలు ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో పరకాలలో జిల్లా అధ్యక్షులు గాదె లింగమూర్తి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తాము 9 మంది ఫోటోగ్రాఫర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. 2023 మంది సభ్యులతో 4 కోట్ల విలువైన బ్యాంక్వెట్ హాల్ నిర్మించామని, మరో కోటి విలువైన భూములు కొనుగోలు చేసి ఫోటో భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కుటుంబ భరోసా ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన సభ్యుడి కుటుంబానికి రూ. 60 వేలు అందిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు లేకున్నా యూనియన్ ద్వారా అండగా.నిలుస్తున్నామన్నారు. తమ 9 మంది ప్యానెల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.