
నిమజ్జనానికి విచ్చేసిన భక్తులకు స్వయంగా అన్నం వడ్డించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు జనం న్యూస్ సెప్టెంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి 2026 సంవత్సర గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి రంగధాముని చెరువు వద్ద నిమజ్జనానికి విచ్చేస్తున్న గణనాథులకు స్వాగతం పలుకుతూ, నిమజ్జన ఊరేగింపులో పాల్గొంటున్న భక్తజనులకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వీఎన్ఆర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం ప్రారంభించే ముందు వడ్డేపల్లి రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా గణనాథునికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులందరికీ కడుపునిండా భోజనం లభించాలని, ప్రతి ఒక్కరిపై గణనాథుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు స్వయంగా భక్తులకు అన్నం వడ్డిస్తూ, నిమజ్జనానికి వచ్చిన భక్తులకు ఆత్మీయంగా సేవలు అందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ “అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న” అని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. భగవంతుని దర్శనం చేసుకోవడంతో పాటు భగవంతుని భక్తులకు సేవ చేయడం కూడా దైవసేవతో సమానమని పేర్కొన్నారు. గణనాథుని నిమజ్జనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా ఆ విఘ్నేశ్వరుడికి సేవ చేసుకున్నట్లుగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గణపయ్య ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీఎన్ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.