
జనం న్యూస్ 25 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ 2019 నుంచి 2026 వరకు స్థలం కేటాయింపు నుంచి హైకోర్టు సంస్థీకరణ వరకు జోగులాంబ గద్వాల జిల్లాకు సమీకృత జిల్లా కోర్టు* సముదాయం ఏర్పాటు చేయాలనే ప్రక్రియ 2019లో ప్రారంభమైంది. జిల్లా న్యాయవ్యవస్థకు అవసరమైన శాశ్వత మౌలిక వసతుల కోసం అనువైన భూమిని గుర్తించే చర్యలు అప్పట్లో మొదలయ్యాయి. 2019–2022: భూమి గుర్తింపు, కేటాయింపు ఈ ప్రక్రియలో భాగంగా పూడూర్ శివారులోని సర్వే నెంబర్. 368లో ఎసి. 10.00 గుంటల భూమిని కోర్టు సముదాయం కోసం గుర్తించారు. అనంతరం ప్రభుత్వం జీవో స్పెషల్ సర్వే నెంబర్ .52 ద్వారా ఆ భూమిని కేటాయించింది. సంబంధిత అధికారుల ద్వారా భూమి స్వాధీనం కూడా అప్పగించబడింది. 2024: పరిపాలనా అనుమతి భూమి కేటాయింపు అనంతరం నిర్మాణానికి* సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టబడ్డాయి. ప్రభుత్వం గవర్నమెంట్ సర్వేయర్ నెంబర్ .597, డట 14-11-2024 ద్వారా సమీకృత జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి రూ. 81 కోట్ల పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. తదుపరి టెండర్ ప్రక్రియ పూర్తై, నిర్మాణ సంస్థ ఎంపికైంది. ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేయాలనే కాలపరిమితితో నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగింది. 2025–2026: నిర్మాణంలో జాప్యం స్థలం కేటాయించబడటం పరిపాలనా అనుమతి లభించడం టెండర్ ప్రక్రియ పూర్తవడం నిర్మాణ సంస్థ ఎంపిక కావడం వంటి చర్యలు పూర్తయినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యం కొనసాగింది. ఇదే సమయంలో జిల్లాలోని కోర్టులు వివిధ ప్రాంతాల్లో* కొనసాగుతుండటంతో న్యాయవాదులు కక్షిదారులు సాక్షులు పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించబడింది. ముఖ్యంగా మహిళా న్యాయవాదులు మహిళా కక్షిదారులు, మహిళా సిబ్బందికి అవసరమైన ప్రాథమిక సదుపాయాల కొరత కూడా సమస్యగా నిలిచింది. ప్రత్యామ్నాయ స్థలాలపై జరిగిన చర్చలు, అధికారుల నివేదికలు ఇప్పటికే కేటాయించిన భూమికి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు ఆర్ టి ఐ ద్వారా సేకరించిన పత్రాలను పరిశీలించిన అనంతరం ఈ అంశాన్ని ప్రజా ప్రయోజన సమస్యగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.2026 మే జూన్: స్థలం అప్పగింత నిర్మాణానికి సిద్ధత 2026 మేలో నిర్మాణ స్థలాన్ని రోడ్లు–భవనాల శాఖకు అప్పగించారు. అనంతరం జూన్లో శాఖ స్థలం పునాది రాయికి సిద్ధంగా ఉందని నివేదించింది. అయినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించడంలో మరింత జాప్యం చోటుచేసుకుంది.
ఇప్పటికే స్థలం నిధులు, పరిపాలనా అనుమతులు టెండర్ ప్రక్రియ అన్నీ పూర్తయిన నేపథ్యంలో నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనే ప్రశ్న ప్రధానంగా మారింది. 2026: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ ఈ పరిస్థితుల్లో అడ్వకేట్ కె. షఫీఉల్లా ప్రజా ప్రయోజన అంశంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు పి ఐ యల్ లో కోర్టు సముదాయం నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో పాటు, ప్రస్తుత కోర్టు భవనాల వల్ల ప్రజలు, న్యాయవాదులు సాక్షులు,మ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ వ్యవహారంలో డబ్ల్యూ పి. 27 of 2026 దాఖలైంది. 22-09-2026న తెలంగాణ హైకోర్టు ధర్మాసనం అని ఆదేశించింది.దీంతో అధికారికంగా సంస్థీకరించబడి, తదుపరి విచారణకు మార్గం సుగమమైంది. ఇది తుది తీర్పు కాకపోయినా సమీకృత జిల్లా కోర్టు సముదాయం నిర్మాణ అంశం న్యాయపరిశీలనలోకి వచ్చిన కీలక దశగా నిలిచింది. ఈ విచారణలో పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ శ్రీలేఖ పూజారి శ్రీనిత పూజారి హాజరయ్యారు రోడ్లు–భవనాల శాఖ తరఫు ఎస్. వివేక్ హాజరయ్యారు. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విస్తృత అంశం గద్వాల సమీకృత జిల్లా కోర్టు సముదాయం నిర్మాణం కేవలం ఒక భవనం ఏర్పాటు చేసే విషయం కాదు. ఇది జిల్లా న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజలకు సులభంగా న్యాయం అందే వాతావరణం, మహిళా న్యాయవాదులు మరియు కక్షిదారులకు అవసరమైన సదుపాయాలు, ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో సమయపాలన వంటి అంశాలకు సంబంధించిన ప్రజా ప్రయోజన సమస్య. సముదాయం పూర్తయితే 10+2 కోర్టులు కోర్టు, ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారుల నివాసాలు, బార్ హాల్, లీగల్ సర్వీసెస్ విభాగం, మెడియేషన్ సెంటర్, లైబ్రరీ, కంప్యూటర్ బ్లాక్, ప్రాసిక్యూషన్ విభాగం, జువెనైల్ జస్టిస్ బోర్డు తదితర సదుపాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్థలం కేటాయింపు, పరిపాలనా అనుమతి, టెండర్ ప్రక్రియతో ప్రాజెక్టు పూర్తికాదు. నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడే అసలు లక్ష్యం నెరవేరుతుంది. పూజారి శ్రీధర్ సీనియర్ అడ్వకేట్ సత్యాస్ లా అసోసియేట్స్, గద్వాల.