
జనం న్యూస్, సెప్టెంబర్ 25,అచ్యుతాపురం : కీటక వ్యాధులపై వైద్య సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి కే వరహాలదొర సూచించారు. హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పెదపాడు గ్రామంలో ఫ్రైడే డ్రైడే జరుగుతున్న తీరును ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించారు. అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ ఏజే సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతివారం డ్రైడే పాటించడం ద్వారా కీటకజనిత వ్యాధులను నివారించవచ్చునని ప్రజలకు తెలియజేశారు. అనంతరం పెదపాడు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్లో మలేరియా రికార్డులను పరిశీలించారు. ప్రతి అనుమానిత మలేరియా కేసును ఐహెచ్ఐపి పోర్టల్ లో నమోదు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మలేరియా కార్యాలయ విస్తరణ అధికారి పిజెఎంఆర్ పి నాయుడు, హెల్త్ సూపర్వైజర్ ఆర్. నాగేశ్వరరావు, హరిపాలెం ఆరోగ్య విస్తరణ అధికారి ఎస్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ ఎంఏయూ మహేష్, వైద్య సిబ్బంది పీఎన్వి అప్పారావు, ఏ గుణలక్ష్మి, బి నాగలక్ష్మి, ఆశా కార్యకర్తలు మణి, విజయ పాల్గొన్నారు.