
జనం న్యూస్,సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ఇటీవల ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు)శుక్రవారం కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో పరిశీలించారు. వరిచేలల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు.సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు.రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ తెదేపా జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి,ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, నాగిడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు ఆకాశం శ్రీనివాస్, ఎమ్మార్వో రవికిరణ్, ఎంపీడీవో బి. రాజేశ్వరరావు, అగ్రికల్చర్ ఏవో ఎం. వృదుల, దాట్ల పవన్, విలేకర్ రాజు, విత్తనాల వెంకటరమణ, విత్తనాల బుజ్జి, వెంట్రు సుధీర్, కముజు లక్ష్మీరమణరావు, గోడి వెంకటేశ్వరరావు, మోకా బాలప్రసాద్, వంగా దుర్గాబాబు, కముజు రాంబాబు, బండారు ఏసు, కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.