

జనం న్యూస్ 15 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అమెరికాలో నివసిస్తున్న సాయి భక్తుడు చంద్రశేఖర్ కమ్మెట్టి సుమారు రూ.75 లక్షల విలువైన అత్యంత ఆకర్షణీయమైన అద్భుతమైన, కళాత్మకమైన బంగారు, వెండి గొడుగును సాయిబాబా పాదాల చెంత సమర్పించారుశక్రమం తప్పకుండా సాయిబాబా దర్బారుకు చంద్రశేఖర్ కమ్మెట్టి స్వస్థలం హైదరాబాద్. ఆయన గత కొన్నేళ్లుగా అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. 1998లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆయన, అదే సంవత్సరంలో తొలిసారిగా శిర్డీకి వచ్చి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన క్రమం తప్పకుండా సాయిబాబా దర్బారుకు హాజరవుతున్నారు. అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఆయన ప్రతి సంవత్సరం కనీసం 4 నుంచి ఐదుసార్లు శిర్డీకి వచ్చి సాయిబాబా పాదాలకు నమస్కరిస్తారు. తన జీవితంలోని ప్రతి దశలోనూ సాయి బాబా తనకు మార్గం చూపారని చంద్రశేఖర్ తన భక్తి భావనను వ్యక్తం చేశారు. 250 గ్రాముల బంగారం, 9 కిలోల వెండితో గొడుగు సాయిబాబా విగ్రహంపై పల్లకీ ఊరేగింపులో ప్రదర్శించబడే ఈ గొడుగును చాలా సుందరంగా తయారు చేశారు. ఈ గొడుగు తయారీకి సుమారు 250 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, 9 కిలోల వెండిని ఉపయోగించారు. భక్తుడు చంద్రశేఖర్ కమ్మెట్టి ప్రకారం ఈ గొడుగు మొత్తం బరువు సుమారు 9.25 కిలోగ్రాములు. దీని తయారీకి అయిన మొత్తం ఖర్చు సుమారు రూ.75 లక్షలు.