
జనం న్యూస్ సెప్టెంబర్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భరత్ నగర్ కాలనీ రెసిడెన్సి వెల్ఫేర్ అసోసియేషన్ 1వ వార్షికోత్సవ వేడుకలు శనివారం భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పట్టోల్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ వైస్-ప్రెసిడెంట్ బండి రమేష్ హాజరై, వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం రెసిడెన్సి వెల్ఫేర్ అసోసియేషన్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కాలనీలోని ప్రజల సమస్యలను సమష్టిగా పరిష్కరించుకుంటూ, ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భరత్ నగర్ కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బి.ఆర్. నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఏ. రాజు, ట్రెజరర్ పి. నరేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ కె. రాంబాబు గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి. వెంకటేష్, కె. పెదబాబు, డేవిడ్, లలిత, యాదవ్, అపర్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పారెడ్డి, ప్రతాప్ రెడ్డి, కొండల్ రెడ్డి, అశోక్, శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, నాగార్జున తదితరులు పాల్గొని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. భరత్ నగర్ కాలనీ రెసిడెన్సి వెల్ఫేర్ అసోసియేషన్‌కు 1వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధించాలని బండి రమేష్ ఆకాంక్షించారు.