
జనం న్యూస్ సెప్టెంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ ఎన్. శ్వేత ఐ పి ఎస్ ఆదేశాలమేరకు మండలం లోని పెద్ద కోడ పాక గ్రామంలో రాత్రి 7:00 గంటల నుంచి 9:30 గంటల వరకు శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాగృతి పోలీస్ కళా బృందం కార్యక్రమంలో భాగంగా ఎస్సై పరమేశ్వర్ మాట్లాడుతు చాల మంది యువకులు గంజాయి డ్రగ్స్,గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్దని, గంజాయి అమ్మిన సేవించిన 1908 టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారo ఇవ్వాలన్నారు. కళా బృందం సభ్యులు, చదువుపై, రోడ్డు ప్రమాదాలు,బాల్య వివాహాలు, బాల కార్మికులు, డయల్ 112, సీసీటీవీ కెమెరాలు, సైబర్ క్రైమ్,గుడుంబా, వృద్ధాప్యంలో వున్న తల్లితండ్రులను మంచిగ చూసుకోవాలని, తదితర సామాజిక అంశాలపై పాటల ద్వార వివరిస్తూ, మూడ నమ్మకాలపై వెలుగుబాట నాటిక ప్రదర్శించినాము. మ్యాజిక్ షో, 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ గురించి చెప్తు పాడిన పాటలు, నాటికలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేశాయి. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, కానిస్టేబుల్స్ సతీష్ చందు ఆఫీసర్స్ కళాబృందం ఇంచార్జీ వుమెన్ ఎ ఎస్ ఐ నాగమణి, సభ్యులు హెడ్ కానిస్టేబుల్స్,విలియం వెంకటేశ్వర్లు, పీ సీ పూల్ సింగ్, హోంగార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.