
జనం న్యూస్, సెప్టెంబర్ 28: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల రెవెన్యూ శివారులోని శ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో శతజయంతోత్సవాల సందర్భంగా సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలకు చెందిన 33 మంది విద్యార్థులు తెలుగు, ఆంగ్ల, హిందీ భాషల్లో ‘కృతజ్ఞత’ అంశంపై వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు, శ్రీ గోవిందగిరి స్వామి శిష్యుడు శ్రీ రాఘవేంద్ర స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాసరచన పోటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాయిరాం బాలరాజ్, గడ్డం మల్లేష్, కొండ అశోక్ గౌడ్, మహేందర్, సహాయకులు కంకణాల రాజేశ్వర్, తీగల రఘు, వేంపల్లి చంద్రశేఖర్ గౌడ్, కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపాల్ పిల్లమారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు మహేష్, శిరీష్, ప్రత్యూష, భారతి, ఆశ్రమ సేవకులు, మాతలు తదితరులు పాల్గొన్నారు.