
జనం న్యూస్- సెప్టెంబర్ 28- నాగార్జునసాగర్ టౌన్- డిఏవి నాగార్జునసాగర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎస్ ఉజ్వల్ 10వ తరగతి, ఆర్ హరి ప్రసాద్ 8వ తరగతి మరియు స్టాండ్ బై గా బాల ఆదిత్య 7వ తరగతి విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికై 24 అక్టోబర్ 2026 నుండి 26 అక్టోబర్ 2026 వరకు ఢిల్లీ లో జరగబోయే డి ఏ వి జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని గతనెల ఆగస్టు 22, 23 తేదీలలో జరిగిన డి ఏ వి రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి గెలుపొంది బాయ్స్ టీమ్ జాతీయ స్థాయికి ఎంపికైనారు ఎంపికైన విద్యార్థులను జెన్కో సీఈ విమంగేష్ కుమార్, ఎస్ఈ టి వెంకటరమణ , సివిల్ ఎస్ సి డిరామకృష్ణారెడ్డి, ఈ ఈ ఏవి. సత్య శివకుమార్ ఎస్ ఏ ఓ డి శిరీష , డిఏవీ (ఏ ఆర్ ఓ) జి ఆర్ కె ప్రసాద్ ప్రధాన ఉపాధ్యాయులు J.పవన్ కుమార్ , పీఈటీ A.సాయికృష్ణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.