
మత్తు పదార్థాలు నిరోధానికి జూనియర్ కళాశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ జనం న్యూస్-సెప్టెంబర్ 28- నాగార్జునసాగర్ టౌన్- మత్తు పదార్థాల నిరోధానికి యువత ఉక్కు సంకల్పం చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు దాసరి రాజశేఖర్ కోరారు. సాగర్ జూనియర్ కళాశాల విద్యార్థుల చేత మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆవాసాల్లో జరుగుతున్న మత్తు పదార్థాల వినియోగంపై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వినియోగం వల్ల అనారోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ అధికారులు సంయుక్తంగా మత్తు పదార్థాల నియంత్రణ కోసం సమిష్టిగా పనిచేస్తున్న విద్యార్థులు, వాటి వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీఓలు చింతపల్లి వెంకటయ్య, ప్రసన్న లక్ష్మీ, అధ్యాపకులు సతీష్ చంద్ర, ఉపేంద్ర చారి, సైదమ్మ, రవీందర్,మాధురి, జనార్దన్, దివ్య శంకర్ ఫాతిమా, మరీనా ,వినోద్, మహేశ్ , లింగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.