
జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులను ఎంపిక చేశారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ మండల ఇన్చార్జి కొడవటి రవి, మండల అధ్యక్షుడు మండలం లోని పత్తి పాక గ్రామానికి చెందిన మారపెల్లి కట్టయ్య(క్రాంతి) లు పలు గ్రామాలలో అధ్యక్షులను ఎంపిక చేశారు అనంతరం ఆయా గ్రామాలలో అధ్యక్షులు గ్రామ కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని గ్రామ అధ్యక్షులకు తెలియజేశారు ఈ సందర్భంగా మండల ఇంచార్జ్ రవి, మండల అధ్యక్షుడు కట్టయ్య లు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో అందరం కలిసి పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి బుజ్జి అన్న రవీందర్, జిల్లా నాయకుడు దుబాసి కృష్ణమూర్తి, నాయకులు కొయ్యడ సాంబయ్య, కొమ్ముల విష్ణు, నాగరాజు, కిరణ్, రాజు, భద్రయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.