
జనం న్యూస్ 29 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్చీ డపీడలు, తెగుళ్ల నియంత్రణపై రైతులకు సాంకేతిక సూచనలు సోమవారం జిల్లాలోని ఐజ వడ్డేపల్లి మల్దకల్ మండలాల్లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డా. పి. అర్చన ఆధ్వర్యంలో పంటల క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. పి. అర్చన ఐజ మండలం వెంకటాపూర్ గ్రామంలో యం ఎ ఓ జనార్ధన్ ఎ ఇ ఓ నవీన్లతో కలిసి పత్తి కంది పంటలను పరిశీలించి 20 మంది రైతులతో మాట్లాడారు. పత్తి కంది పంటలను పరిశీలించగా తక్కువ వర్షపాతం బోరుబావులు ఎండిపోవడం వల్ల పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లోనే రబీ పంటలు సాగు చేయాలని ఫామ్ పాండ్లు పెర్కొలేషన్ ట్యాంకుల ద్వారా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని రైతులకు సూచించారు. వడ్డేపల్లి మండలం జూలకల్ ఫామ్లో సాగు చేసిన కంది పంటను పరిశీలించగా పంట ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు మల్దకల్ మండలంలో యం ఎ ఓ రాజశేఖర్ క్లస్టర్ ఎ ఇ ఓ రాహుల్ పైలట్లతో కలిసి పత్తి వరి బెండ టమాట పంటలను పరిశీలించారు. పింక్ బోల్వార్మ్ నివారణకు ఫెరోమోన్ ట్రాపులను వినియోగించాలని పురుగు ఉధృతిని బట్టి సిఫార్సు చేసిన పురుగుమందులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. వరి పంటలో ఆకులు కాండం ఎర్రబడటానికి గల కారణాలను ముందుగా నిర్ధారించిన తర్వాతే తగిన నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. బెండ టమాట పంటల్లో చీడపీడలు వాడిపోయే తెగుళ్లను తొలిదశలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పంటలకు అధిక నీటిపారుదల లేకుండా చూసుకోవాలని సూచించారు. రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ సిఫార్సు చేసిన మోతాదుల్లోనే పురుగుమందులు వినియోగించి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవాలని డా. పి. అర్చన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.