
జనం న్యూస్ సెప్టెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గా భవన్లో బాలానగర్ డివిజన్‌కు చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోను తండ్రి మహమ్మద్ మక్బూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ ఓ సి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేశారు. ఈ మేరకు రూ. 3,00,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీ చెక్ మంజూరు కాగా, బండి రమేష్ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎజాజ్, రంగారావు, శివ ,రమణ, నరేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.