
జనం న్యూస్, సెప్టెంబర్ 30, అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ , యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాలు, పాఠకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.గ్రంథాలయ, తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో మాట్లాడి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ నిర్వహణ, పాఠకులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరమైన మౌలిక సదుపాయాల గురించి వివరాలు సేకరించారు. గ్రంథాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
అనంతరం అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడ నూతన ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం కోసం స్థలాన్ని చదును చేసి, పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. నూతన కార్యాలయం అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రంథాలయ సిబ్బంది కూటమి నాయకులు. తదితరులు పాల్గొన్నారు.