
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 30-09-2026 జర్నలిస్టుల హక్కుల కోసం ఎంత దాకా అయినా పోరాటం చేద్దామని పెబ్బేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్ అన్నారు. అక్టోబరు 2న ఇండియన్ జర్నలిస్టు యూనియన్ గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలను చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐజేయు అనుబంధంగా ఉన్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాకేంద్రాల్లో జిల్లా శాఖల సమక్షంలో అధ్యక్ష, కార్యదర్శులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుధవారం పెబ్బేరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు, తదితర ముఖ్య నాయకులు మాట్లాడారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద నిర్వహించున్న నిరసన కార్యక్రమానికి పెబ్బేరు ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండిగులో ఉన్న ఇళ్ల స్తలాల సమస్య, నెల వారీ పారితోషకాల గురించి, జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో యూనియన్ చేపట్టిన జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్ జనరల్ సెక్రటరీ పరుషరామ్, యూనియన్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బాలరాజు, క్లబ్ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, కిరణ్ కుమార్ గౌడ్, నాయకులు రాజేంద్రప్రసాద్, అతీఖ్ పాషా, మన్నెం, రాంబాబు, నాగరాములు, తరుణ్, లక్ష్మీనారాయణ, రమేష్, విభూది కుమార్, భాస్కర్, ఎల్లస్వామి, చెంద్రాయుడు, కృస్ణ, రామకృష్ణ, బుచ్చన్న, ఎం. గోపాలకృస్ణ, తదితరులు పాల్గొన్నారు.