
చేనేత కార్మికులు డిమాండ్జ నం న్యూస్, సెప్టెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం రంగాపురంలో శ్రీ రామలింగేశ్వర చేనేత సహకార సంఘం వద్ద బుధవారం చేనేత సంఘ కార్మికులు సమావేశమై చేనేత సంఘాల అభివృద్ధిపై సమీక్షించారు.పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఏళ్లు డుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం వల్ల సంఘాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే పాలకవర్గాలను నియమించాలని,చేనేత సంఘాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీ భారం తగ్గించాలని కోరారు. చేనేత వస్త్రాలపై సంవత్సరం పొడవునా 30 శాతం రిబేటు అందించాలని,నూలు ధరలు తగ్గించి కార్మికులకు చేతి నిండా పని కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షులు కరెళ్ల వీర వెంకట సత్యనారాయణ,సోరపల్లి వేణు,నాయుడు శ్రీను, కరెళ్ల వెంకటేశ్వరరావు, పోతాబత్తుల శివ, కరెళ్ల గోవిందరావు, పోతాబత్తుల వెంకటేశ్వరరావు, సోరపల్లి పద్మినీ కుమార్, కరెళ్ల పోలేశ్వరరావు, కరెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.