
జనం న్యూస్ అక్టోబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకo గా ప్రతినెల ఒకటవ తేదీన ఉదయం 6:30 గంటల నుండి అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకంలో అక్టోబర్ నెలలో అనకాపల్లి జిల్లాలో 2,50,168 పెన్షన్లు అందజేస్తున్నారని, దీనికోసం ప్రభుత్వం 106 కోట్లు నిధులు విడుదల చేసిందని మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు ఉదయం 81 వ డైమండ్ కాన్వెంట్ రోడ్డు, సత్తెమ్మ తల్లి కోవెల వద్ద, 84 వ వార్డు లో నెయ్యిలు వీధిలో పెన్షన్ లబ్ధిదారులకు వృద్ధులకు 4000 వికలాంగులకు, 6000 పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలను ఉద్దేశించిన నాగ జగదీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఎన్ డి ఏ ప్రభుత్వం కొలువుదీరి 27 నెలలు గడిచాయని, త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు నాడి తెలుసుకోవడానికి ఒక ప్రైవేటు సర్వే సంస్థ 175 నియోజకవర్గాలలో సమగ్ర సర్వే చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం కలిగి ఉన్నారని, తెలుగుదేశం జనసేన బిజెపికి కలిసి 59.4 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ తెలియజేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమలు వస్తున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, పోలవరం ఎడమ కాలువ ద్వారా రైతాంగానికి సాగునీరు ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమాన్ని చేసి చూపించారని, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులకి ఓట్లు వేసి గెలిపించి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కొణతాల వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ దాడి వీర వెంకట అప్పారావు బోడి వెంకటరావు కుప్పిలి జగన్ మల్ల గణేష్ కొణతాల నూక నాయుడు రామోజీ శామ్ సుందర్ రేబాక ఈశ్వర అప్పారావు శ్రీకాకుళం గణపతి లోవ ఇండిపల్లి మహేష్ కాండ్రేగుల వెంకట సూరి బుద్ధ కాశీ బొడ్డేడ అప్పల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.//